అమరావతి: రాజధాని మాస్టర్ ప్లాన్ అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని అయితే ఇకనైనా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో కోరారు. 

వెలగపూడి గ్రామానికి చెందిన కె.రాంబాబు, జి.భానుప్రకాష్, నాయుడు రామకృష్ణ, అబ్బూరి కిరణ్ కుమార్ లు హఐకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. వీరితరపున అడ్వకేట్ కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించనున్నారు. 

రాజధాని అమరావతి లో మాస్టర్ ప్లాన్ -II ప్రకారం త్వరితగతిన పనులు ప్రారంభించాలని కోరారు. అలాగే అత్యంత ప్రాధాన్యతతో  కొండవీటి వాగు , పాలవాగు వరదనివారణ చర్యలు తీసుకునే విధంగా  ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా రిట్ పిటీషన్ లో పేర్కొన్నారు. 

రిట్ పిటీషన్ పై విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది. మంగళవారం ఈ కేసుపై హైకోర్టులో విచారణ చేపట్టనుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ రాజధానిగా అమరావతి గుర్తింపు: కొత్త మ్యాప్ విడుదల చేసిన కేంద్రం