టిడిపికి ఝలక్ ఇస్తున్న టిడిపి ప్రముఖుడు, (వీడియో)

Vasanta Krishna Prasad says he will join ycp in a day or two
Highlights

రేపో మాపో వైసిపిలోచేరిక

మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరతున్నట్లు ప్రకటించారు. ప్రజాసంకల్ప యాత్ర  లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో  తన అనుచరులతో కలిసి వెళ్ళి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు ఆయన చెప్పారు. గతంలో నేను ఏ పార్టీ లో ఉన్న పదవులు కోసం పని చేయ్యలేదని కేవలం పార్టీ కోసమే పనిచేశాను, వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటి చేస్తాననని కూడా ఆయన చెప్పారు. నేను ఎక్కడి నుండి పోటీ చేయ్యాలో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని కూడా ఆయన చెప్పారు. నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే ఆలోచన ఉందని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించి మాట్లాడారని ఆయన వెల్లడించారు.గుంటూరు జిల్లా లో వేదిక రాజకీయ గా అవకాశం కల్పిస్తామని అక్కడ పనిచేసుకోమని చెప్పారని తెలిపారు.

‘‘కాని మా నాన్న గారు కృష్ణా జిల్లా లో నే రాజకీయాలలో ఉన్నారు నేను కూడా కృష్ణా జిల్లా లో రాజకీయ ప్రవేశం చేశాను. నా అనుచరులు అంతా కృష్ణా జిల్లా లోనే ఉన్నారు నేను కూడా నాన్నగారు లాగా కృష్ణా జిల్లా నుండి రాజకీయ లో పోటి చేయ్యలని నిర్ణయం తీసుకున్నాను,’’ అని ఆయన చెప్పారు.

 

loader