కులం పేరుతో దూషించి నోరు పారేసుకున్న వర్ల రామయ్య

Varla Ramaiah in controversy making unwanted comments
Highlights

ఓ యువకుడిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసి) చైర్మన్ వర్ల రామయ్య అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: ఓ యువకుడిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసి) చైర్మన్ వర్ల రామయ్య అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో దూషించి నోరు పారేసుకున్నారు. ఓ బస్సును తనిఖీ చేసిన సందర్బంగా గురువారం ఆయన ఓ యువకుడి పట్ల అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు.

ఇటీవల ఆర్టీసి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన గురువారంనాడు మచిలీపట్నంలో బస్సును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ యువకుడు సెల్ ఫోన్ లో పాటలు వింటూ కనిపించాడు. దాంతో ఆయన ఆ యువకుడి కులంపై అభ్యంతరకరంగా వ్యవహరించారు.

ఆ యువకుడి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదువుకోవాలని, సెలవుల్లో కూలీపనులకు వెళ్లాలని సుద్దులు చెబుతూనే అతని కులం గురించి అడిగారు. తాను ఎస్సీనని ఆ యువకుడు చెప్పాడు. అయితే, వర్ల రామయ్య అంతటితో ఆగకుండా మాలనా, మాదిగనా చెప్పాలని అడిగారు. 

దాంతో ఆ యువకుడు తాను మాదిగను అని చెప్పాడు. మాదిగలు అసలు చదువరంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ మాటతో ఆ యువకుడే కాదు, అక్కడున్న టీడీపి నాయకులు, ప్రయాణికులు అవాక్కయ్యారు. నాయనకు ఏ మాత్రం ఉపయోగపడడంటూ వ్యాఖ్యానించాడు.  ఆ తర్వాత వర్ల రామయ్య విజయవాడ బయలుదేరి వెళ్లారు. 

loader