మరోసారి నోరు జారిన వర్ల రామయ్య

varla ramaiah contavercy comments on people
Highlights

హత్య చేస్తే జైలుకు వెళ్తారని అందరికీ తెలసునని, కానీ ఎంత మంది ఊరుకుంటున్నారని, శిక్ష పడుతుందని తెలినసినా హత్యలకు పాల్పడుతున్నారంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. 

ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్ పర్సన్ వర్ల రామయ్య.. మరోసారి నోరు జారారు. గతంలో ఓ దళిత యువకుడుని తక్కువ చేసి మాట్లాడి ఆయన వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఆ విషయం పెద్దది కావడంతో క్షమాపణలు తెలిపారు. తాజాగా.. మరోసారి ఆయన నిర్లక్యంగా మాట్లాడారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ ఆర్టీసీ పై అధ్యయనం చేయడానికి ఆయన గుజరాత్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడుతూ.. హత్య చేస్తే జైలుకు వెళ్తారని అందరికీ తెలసునని, కానీ ఎంత మంది ఊరుకుంటున్నారని, శిక్ష పడుతుందని తెలినసినా హత్యలకు పాల్పడుతున్నారంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. 

ఏపీలో ప్రైవేట్‌ బస్సుల కల్చర్‌ ఇప్పటిది కాదని, దానికి చంద్రబాబుని బాధ్యుడ్ని చేయడం సరికాదన్నారు. ప్రయాణికుల్లో మార్పు రావాలని, ప్రైవేటు బస్సుల్లో ప్రయానించొద్దు అనే ఉద్యమాన్ని ప్రజలే తీసుకు రావాలంటూ వ్యాఖ్యానించారు. బస్సు స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ టికెట్స్ అమ్మవద్దని రూల్ ఉందని, కానీ ఎవరు రూల్స్ పాటిస్తారంటూ మాట్లాడారు. 

loader