అమరావతి: ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీపై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పృథ్వీని ఆయన రక్తి స్వామిగా అభివర్ణించారు. భక్తికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎస్బీబీసీలో రక్తిస్వామి పృథ్వీ రాజ్్ ను నియమించారని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు పృథ్వీకి సంబంధించిన ఆడియో ఫుటేజీ వెలుగు చూసిన విషయం తెలిసిందే.

డీజీపీ గౌతమ్ సవాంగ్ కు తమ టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. చంద్రబాబు పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడలేదని ఆయన అన్నారు. 

Also Read: మహిళలపై వ్యాఖ్యలు: జోక్యం చేసుకున్న వైవీ, రాజీనామాకు సిద్ధమైన పృథ్వీ..?

మహిళల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నందుకు ముఖ్యమంత్రి, హోం మంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కొందరు పోలీసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాయలో పడ్డారని ఆయన అన్నారు.

వైసీపీ ర్యాలీలకు, ఊరేగింపులకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం జేఏసీ ర్యాలీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కూడా రాజధాని గ్రామాల్లో పర్యటించలేని స్థితి ఉందని ఆయన అన్నారు.

Also Read: ఉద్యోగినితో పృథ్వీ అసభ్య సంభాషణ: విచారణకు టీటీడీ ఛైర్మెన్ ఆదేశం.