అమరావతి:రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  29 గ్రామాల ప్రజలు 71 రోజులుగా పైగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏ పని చేసినా కూడ  అమరావతి అంశాన్ని  మాత్రం  వదలడం లేదు.  తాజాగా ఓ పెళ్లి వేడుకలో నూతన వధూవరులు 'జై అమరావతి' అంటూ ప్లకార్డులు  ప్రదర్శించారు. 

also read:సేవ్ అమరావతి: పెళ్లి పత్రికపై సురేష్ వినూత్న ప్రచారం

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం సానుకూలంగా ఉంది. అమరావతిలోనే  రాజధానిని కొనసాగించాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో  బుధవారం నాడు జరిగిన పెళ్లిలో   జై అమరావతి  ప్ల కార్డులు ప్రదర్శించారు.

also read:పుష్పక విమానంలో దిగిన వధూవరులు: విజయవాడలో వెరైటీ పెళ్లి వేడుక

పెళ్లి జరిగిన తర్వాత నూతన వధూవరులు  జై అమరావతి అంటూ ముద్రించిన ప్ల కార్డులు  ప్రదర్శించారు. పెళ్లికి హాజరైన బంధు మిత్రులు కూడ  జై  అమరావతి అన్న ప్ల కార్డులు ప్రదర్శించారు.  జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

also read:కర్ణాటకలో వెరైటీ పెళ్లి పత్రిక: హల్ టిక్కెట్టు నమూనాలో వెడ్డింగ్ కార్డు

ఇటీవలనే  కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామంలో జాస్తి సురేష్ తన పెళ్లి పత్రికను వెరైటీగా తయారు చేయించాడు. సేవ్ అమరాతి అని ముద్రించిన పెళ్లి పత్రికలను ముద్రించి బంధు మిత్రులకు పంచాడు.