ఏంటో చూపిస్తా... ఎలా ముగించాలో నాకు బాగా తెలుసు: వైసిపికి వంగవీటి రాధ స్ట్రాంగ్ వార్నింగ్ (వీడియో)
వైసిపి శ్రేణుల దాడిలో ధ్వంసమైన టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటిని పరిశీలించిన వంగవీటి రాధ కుటుంబసభ్యులను పరామర్శించారు.
విజయవాడ: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంతో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటిపై వైసిపి శ్రేణులు దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం kommareddy pattabhiram ఇంటికెళ్లిన కొందరు వైసిపి వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఇంటి ఆవరణలోకి ఓ కారుతో పాటు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసారు. ఇంట్లోని మహిళలను కూడా దుర్భాషలాడినట్లు టిడిపి నాయకులు అంటున్నారు.
YCP శ్రేణుల దాడితో తీవ్ర భయాందోళనకు గురయిన పట్టాభి కుటుంబసభ్యులను టిడిపి నాయకులు వంగవీటి రాధ పరామర్శించారు. దాడిలో ధ్వంసమైన వస్తువులను పరిశీలించిన vangaveeti radha పట్టాభి కుటుంబసభ్యులను అడిగి దాడి వివరాలను తెలుసుకున్నారు. పట్టాభి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన రాధ వైసిపికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వీడియో
ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లపై పడి అధికార పార్టీ మూకలు దాడి చేయడం హేయమంటూ రాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇళ్లపైకి వచ్చి మహిళలపై దాడి చేయడం.. చిన్న పిల్లలను భయబ్రాంతులకు గురిచేయడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. గుణదలలో నీచ రాజకీయాలు తిరిగి పురుడు పోసుకుంటున్నాయని అనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
''ఇళ్లల్లో ఉన్న మహిళలపై దాడి చేసేంత హేయమైన చర్యలకు ముగింపు ఏంటో చూపిస్తా. గుణదల అరాచకాలు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు'' అంటూ వంగవీటి రాధ అధికార వైసిపికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబడుతూ నిన్న(మంగళవారం) tdp అధికార ప్రతినిధి పట్టాభిరాం ఏపీ సీఎం ys jaganmohan reddy పై విరుచుకుపడ్డారు. దీంతో ఆగ్రహించిన వైసిపి శ్రేణులు ఆయన ఇంటితో పాటు టిడిపి కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మొదట పట్టాభి ఇంటిపై అనంతరం టిడిపి కార్యాలయంపై దాడి జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాలో కూడా ఇలాగే టిడిపి ఆఫీసులపై దాడులు జరిగాయి.
vijayawada లోని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన వైసిపి వర్గీయులు మహిళలను భయబ్రాంతులకు గురిచేసారు. ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్రవాహనం, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు.
read more AP Bandh:మాజీ మంత్రి దేవినేని ఉమను ఈడ్చుకెళ్లిన పోలీసులు, గొల్లపూడిలో ఉద్రిక్తత (వీడియో)
అటు వైసీపీ మద్దతుదారులు అని చెబుతున్న కొందరు హిందూపురంలో సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (nandamuri balakrishna) ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. టీడీపీ నేత లింగారెడ్డి (linga reddy) ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు.
మంగళవారం వరుసగా చోటుచేసుకున్న ఘటనలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో తమ నాయకులు ఇళ్లు, కార్యాలయపైనే కాకుండా కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ టిడిపి ఇవాళ ఏపీ బంద్ చేపట్టింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.