AP Bandh:మాజీ మంత్రి దేవినేని ఉమను ఈడ్చుకెళ్లిన పోలీసులు, గొల్లపూడిలో ఉద్రిక్తత (వీడియో)
ఏపీ బంధ్ సందర్భంగా నిరసన తెలియజేయడానికి రోడ్లపైకి వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమను కూడా అరెస్ట్ చేసారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపైనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై వైసిపి శ్రేణుల దాడికి నిరసనగా ఏపీ బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ(బుధవారం) ఉదయం నుండి TDP నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చిన టిడిపి నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.
AP Bandh లో భాగంగా కృష్ణా జిల్లా గొల్లపూడి సెంటర్ లో నిరసన తెలియజేయడాని వచ్చిన మాజీమంత్రి Devineni Uma ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. భారీగా మొహరించిన పోలీసులు ఉమ బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించారు దేవినేని ఉమ.
వీడియో
ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆటవిక, అరాచక పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజల స్వేచ్చనే కాదు ఇప్పుడు పార్టీల స్వేచ్చను కూడా జగన్ సర్కార్ హరిస్తోందన్నారు. పోలీసులు YSRCP కి తొత్తులుగా మారిపోయారని ఉమ మండిపడ్డారు.
read more ఏపీ బంద్: అచ్చెన్నాయుడి గృహనిర్బంధం, టీడీపీ శ్రేణుల అరెస్ట్
టిడిపి కేంద్ర కార్యాలయంపై వైసిపి గుండాలు దాడి చేస్తే దానికి నిరసనగా బంద్ చేపట్టడం తప్పా? అని అడిగారు. ముఖ్యమంత్రి ys jagan అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలని హెచ్చరించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న క్రమంలోనే దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇప్పటికే ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడిని కూడా పోలీసులు గృహనిర్భంధం చేసారు. ఆయనను ఇంట్లోంచి బయటకు రాకుండా భారీగా పోలీసులను మొహరించారు. దీంతో ఏపీ బంధ్ లో atchannaidu పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది.
అలాగే నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ చదలవాడ అరవిందబాబును కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర బంధ్ లో భాగంగా నరసరావుపేటలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండుకు ర్యాలీగా బయలుదేరారు. వారిని ఓవర్ బ్రిడ్జీపై పోలీసులు అడ్డుకుని చదలవాడ అరవిందబాబును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గుంటూరు బస్టాండ్ వద్ద బంద్ నిర్వహిస్తున్న గుంటూరు తూర్పు టిడిపి ఇంచార్జి మొహమ్మద్ నసీర్, గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ, యల్లువల అశోక్ ,ప్రధాన కార్యదర్శి షేక్ నాగులమీర బాపట్ల తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కొల్లూరు నాగ శ్రీధర్ ను టిడిపి తెలుగుయువత నాయకులను అరెస్ట్ నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇలా ఏపీ బంధ్ సందర్భంగా రోడ్లపైకి వస్తే చాలు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయినప్పటికి రాష్ట్ర బంధ్ ను టిడిపి శ్రేణులు కొనసాగిస్తున్నాయి. పోలీసులు తీరుపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.