Asianet News TeluguAsianet News Telugu

మేం తలచుకుంటే నిమిషం పట్టదు .. సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్, కోడికత్తిగా: జగన్‌పై నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో టీడీపీ నేతల నివాసాలు, కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నాళ్లు ఇలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడి చేయిస్తావు... నువ్వే రా తేల్చుకుందాం! అంటూ సవాల్ విసిరారు.
 

tdp leader nara lokesh slams ap cm ys jagan over ysrcp activists attack on telugu desam party offices
Author
Amaravati, First Published Oct 19, 2021, 9:50 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాష్ట్రంలో టీడీపీ నేతల నివాసాలు, కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నాళ్లు ఇలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడి చేయిస్తావు... నువ్వే రా తేల్చుకుందాం! అంటూ సవాల్ విసిరారు.

"ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించేవాడ్ని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్ అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ దందా చేస్తారు... ఆ విషయాలపై నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతావా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

 

 

"నీ కార్యాలయాల విధ్వంసం మాకు నిమిషం పని. మా కార్యకర్తలు నీ ఫ్యాన్ రెక్కలు మడిచి, విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం దాటేంత వరకు తరిమికొడతారు" అంటూ హెచ్చరించారు. "ఆనవాయితీలన్నింటిని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యానికి పాతరేసి, నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా!" అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు.

ALso Read:టీడీపీ కార్యాలయంపై దాడి: ఉద్యోగులను వెంటాడి వెంటాడి కొట్టిన వైసీపీ కార్యకర్తలు (వీడియో)

"తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టీడీపీ కేంద్ర కార్యాలయంపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా?" అంటూ లోకేశ్ మండిపడ్డారు. "నిన్ను ఉరికించి కొట్టడానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన పనిలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంతో ఉన్న క్యాడర్ కు మా లీడర్ ఒక్క కనుసైగ చేస్తే చాలు" అంటూ స్పష్టం చేశారు.

కాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan), రాష్ట్ర ప్రభుత్వంపై (ap govt) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ (ysrcp) నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగారు. ఇప్పటికే విజయవాడలోని పట్టాభి ఇంటిపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. అదే సమయంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనా వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఆఫీసు ఆవరణలో పార్క్ చేసిన వాహనాలను కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా కార్యాలయంలోకి చొరబడి ఉద్యోగులపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. రక్తంకారుతున్నా వదలకుండా వెంటాడి వెంటాడి మరి కొట్టారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios