నాదెండ్లతో వంగవీటి రాధా భేటీ: పొలిటికల్ వర్గాల్లో చర్చ


జనసేన కీలక నేతతో  వంగవీటి రాధా భేటీ కావడం  రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 

Vangaveeti Radha Meets Jana sena Leader Vangaveeti Radha lns

గుంటూరు: జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తో  వంగవీటి రాధా సోమవారంనాడు రాత్రి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టుగా సమాచారం.

also read:మహారాష్ట్ర గడ్చిరోలిలో ఎదురుకాల్పులు: నలుగురు మావోయిస్టుల మృతి

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో  వైఎస్ఆర్‌సీపీని వీడి వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగు దేశం పార్టీ ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది. అయితే ఈ రెండు జాబితాల్లో  వంగవీటి రాధాకు చోటు దక్కలేదు. అయితే  సోమవారం నాడు రాత్రి నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా భేటీపై రాజకీయపరంగా ప్రాధాన్యత నెలకొంది.

also read:తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్: నాలుగు రోజులపాటు వర్షాలు

ఈ దఫా తెనాలి అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా  నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు. దీంతో  తెనాలిలో  పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెనాలిలోని పార్టీ కార్యాలయంలో  నాదెండ్ల మనోహర్ తో  వంగవీటి రాధా భేటీ అయ్యారు.అయితే ఈ భేటీకి ప్రాధాన్యత లేదని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మర్యాద పూర్వకంగానే  వంగవీటి రాధా కలిశారని ఆయన చెప్పారు.

also read:ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు: టిక్కెట్లు ఎవరికో?

జనసేన పార్టీ కేవలం ఆరు స్థానాల్లో అభ్యర్ధులను మాత్రమే ప్రకటించింది. ఇంకా  మిగిలిన 15  అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ కూడ  తమకు కేటాయించిన  10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించలేదు.  బీజేపీ ఎన్నికల కమిటీ  సమావేశం తర్వాత అభ్యర్ధుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. 

also read:కడప పార్లమెంట్ స్థానం: వై.ఎస్. షర్మిల పోటీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్ స్థానాలకు ఈ ఏడాది మే  13న పోలింగ్ జరగనుంది. ఈ దఫా తెలుగుదేశం,జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి.  వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది.  కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఐ(ఎం)లతో కలిసి పోటీ చేయనుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios