కడప పార్లమెంట్ స్థానం: వై.ఎస్. షర్మిల పోటీ?

కడప పార్లమెంట్ స్థానం నుండి వై.ఎస్. షర్మిల  పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది.ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడ షర్మిల ఈ విషయమై చర్చలు జరుపుతున్నారని సమాచారం.

Y.S. Sharmila plans To Contest From Kadapa Parliament Segment lns


కడప: కడప పార్లమెంట్ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  వై.ఎస్ షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  ఈ విషయమై ఎఐసీసీ నేతలు షర్మిలతో మాట్లాడుతున్నారని  ప్రచారం సాగుతుంది.  కాంగ్రెస్ పార్టీ  త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఈ దఫా ఎన్నికల్లో మెరుగైన ఓట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలోనే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్ష బాద్యతలను షర్మిలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

also read:తెలంగాణను దోచుకున్నవారిని వదలం: లిక్కర్ స్కాంపై జగిత్యాల సభలో మోడీ వ్యాఖ్యలు

ఈ ఏడాది మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం)లు కలిసి పోటీ చేయనున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు మరో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి.  వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది.

also read:తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజీనామా: తమిళనాడు నుండి ఎన్నికల బరిలోకి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిలను  ఆ పార్టీ నాయకత్వం ఎంచుకుంది. ఈ మేరకు షర్మిలకు పార్టీ పగ్గాలను కూడ కట్టబెట్టింది. కాంగ్రెస్ నాయకత్వం . షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా  పార్టీని  బలోపేతం చేయవచ్చని ఆ పార్టీ నాయకత్వం భావించింది.  వైఎస్ఆర్‌సీపీ వైపు మళ్లిన ఓటు బ్యాంకును తిరిగి తమ పార్టీ వైపునకు మరల్చే వ్యూహంలో భాగంగానే షర్మిలకు ఏపీ పార్టీ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది.పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.  పార్టీని బలోపేతం చేసేందుకు  చర్యలు చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గతంలో చురుకుగా పనిచేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

 



 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios