‘గుడివాడలో క్యాసినో జరగలేదు.. నా స్నేహితులే వాటిని నిర్వహించారు..’ వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు
కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారం (Gudivada casino Issue) ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తన కన్వెన్షన్‌లో అలాంటిదేమి జరగలేదని మంత్రి కొడాలి నాని (Kodali Nani) చెబుతున్నారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించి కొడాలని నాని సన్నిహితుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) స్పందించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారం (Gudivada casino Issue) ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌లో కేసినో నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తన కే కన్వెన్షన్‌లో అలాంటిదేమి జరగలేదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించి కొడాలని నాని సన్నిహితుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) స్పందించారు. ఓ టీవీ చానల్‌తో మాట్లాడిని వంశీ.. అసలు గుడివాడలో కేసినో నిర్వహించలేదని అన్నారు. ప్రతి ఏడాది లాగే కోడి పందాలు, పేకాట శిబిరాలు మాత్రమే జరిగాయని చెప్పారు. అది క్యాసినో, క్యాబెరోనో కాదని తెలిపారు.
టీడీపీ నేతలు చెబుతున్నట్టుగా ఇది కే కన్వెన్షన్‌లో జరగలేదని.. దాని పక్కనే ఉన్న స్థలంలో జరిగిందని అన్నారు. కొడాలి నాని ఆరోగ్యం బాగాలేకపోవడంతో హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పారు. తన స్నేహితులే ఈ శిబిరం నిర్వహించారని వల్లభనేని వంశీ తెలిపారు. శిబిరం నిర్వహకులు ఎవరో నానికి తెలియదన్నారు. మహిళల డ్యాన్స్‌లకు సంబంధించి ఎలాంటి అర్దనగ్న దృశ్యాలు లేవని.. మహిళలు డ్యాన్స్ వేయిస్తున్న విషయం తెలిసి వెంటనే ఆపివేయించినట్టుగా చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ నిజనిర్దారణ కమిటీ పేరుతో రచ్చ చేస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా విభేదించామని బురద జల్ల ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను, కొడాలి నాని టీడీపీపై విమర్శలు చేస్తున్నామని ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ఇక, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న కొడాలి నాని (kodali nani) సంక్రాంతి పండగ (sankranti festival) సందర్భంగా అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలను ఏర్పాటు చేసారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ గుడివాడ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారిని కే కన్వెన్షన్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతల పర్యటన సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఇదిలా ఉంటే కొడాలని నాని మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తన ఫంక్షన్ హాల్ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని... జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని కొడాలి నాని సవాల్ చేశారు. అయితే ఈ సవాలుకు టీడీపీ నేతలు కూడా సై అంటున్నారు. కొడాలి నాని దమ్ముంటే తేల్చుకుందామంటూ తిరిగి సవాలు విసిరుతున్నారు. కొడాలి నాని ఫంక్షన్ హాల్‌లో క్యాసినో జరిగిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయిని చెబుతున్నారు.