ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్ధి విజయం సాధించారు. 1,537 ఓట్ల మెజారిటీతో యూటీఎఫ్ అభ్యర్ధి షేక్ సాబ్జీ గెలుపొందారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 14వ తేదీన ఉభయ గోదావరి, కృష్ణా–గుంటూరు జిల్లాలకు సంబంధించి జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

బుధవారం  ఉదయం 8కి లెక్కింపు మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను కాకినాడ జేఎన్‌టీయూ కాలేజీలోను, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను గుంటూరు ఏసీ కాలేజీలోను లెక్కించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.