పోలవరం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న స్పిల్ వే లు చివరి దశకు చేరుకున్నారు. ఇలా అన్ని పిల్లర్లు 52  మీటర్లు ఎత్తుకు రావడంతో గడ్డర్లు మొదలుపెట్టారు. 45-46 పిల్లర్లు మీద గడ్డర్ల నిర్మాణాన్ని మొదలు పెట్టింది నిర్మాణ సంస్థ. 

వీడియో

వర్షాకాలంలో భారీ వరదలు వచ్చినా నిర్మాణ పనులు ఆగకుండా ముందుకు సాగేలా ప్రత్యేక  ప్రణాళికలు రూపొందించారు. నిరంతరాయంగా పనులు జరిపి వర్షాకాలంలోనే ఈ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసే దిశగా ముందుకు వెళుతున్నారు.  అందులో భాగంగా నే ఈ రోజు గడ్డర్లు నిర్మాణం మొదలుపెట్టారు. నవంబర్ నాటికి స్పిలి వే పూర్తి చేసి గేట్లు నిర్మాణం  డిసింబర్ నుండి మొదలుపెట్టనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. 

విజయవాడలోని ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయం లో పోలవరం పనులకు సంబంధించి అధికారులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. పోలవరం నిర్మాణ పనులు, ఆర్ అండ్ ఆర్, ఇళ్ళ నిర్మాణాలు తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం పనులు వేగవంతంగా చేసి అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులకు మంత్రి అనిల్ కుమార్ ఆదేశాలిచ్చారు. 

అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలన్న పట్టుదలతో వున్నారు. ఇందుకు పలుమార్లు ఆయన పోలవరం గురించి మాట్లాడిన మాటలే నిదర్శనం. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.