చంద్రబాబునాయుడుకు ఒకేరోజు త్రిబుల్ షాక్ తగిలింది. రెండు షాక్ లు ఒకే కార్యక్రమానికి సంబంధించినవైతే మరో షాక్ తెలంగాణా సిఎం కెసిఆర్ నుండి తగిలింది. మొదటి రెండు షాకులు ఇవాంకా ట్రంప్ సిబ్బంది వల్ల తగిలింది.  గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్య అతిధిగా హాజరయ్యేందుకు ఇవాంకా హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే కదా? అదే సదస్సులో హాజరయ్యేందుకు చంద్రబాబు తెగ ప్రయత్నించారు. ఎపి ఎకనమిక్ బోర్డు ద్వారా కేంద్రానికి లేఖ రాయించినా చంద్రబాబుకు ఆహ్వనం దక్కలేదు. దాంతో చప్పుడు చేయకుండ మౌనం వహించారు.

సరే, ఇవాంకా ఎటూ హైదరాబాద్ కు వస్తోంది కదా? 24 గంటలు హైదరాబాద్ లోనే ఉంటోంది కదా ఆమెనే ఎందుకు విజయవాడకు రప్పించ కూడదని మళ్ళీ ఆలోచించారు. వెంటనే ఉన్నతాధికారులను రంగంలోకి దింపేసారు. దాంతో చంద్రబాబు చెప్పారు కదా అని అధికారులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమెరికన్ ఎంబసీ ద్వారా ఇవాంకా వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడారు. ఇవాంకా హైదరాబాద్ లో ఉండే సమయంలోనే ఓ గంటపాటు అమరావతికి తీసుకెళ్ళేందుకు అనుమతించమంటూ లేఖలో పేర్కొన్నారు.  

తమది కొత్త రాష్ట్రమని, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తామంటూ చెప్పుకున్నారు. అయితే, అధికారుల అభ్యర్ధనలను అమెరికా తోసిపుచ్చింది. ఇవాంకాకు హైదరాబాద్ ప్రోగ్రామ్ తప్ప వేరే కార్యక్రమాలేవీ లేవని స్పష్టం చేసారు. హైదరాబాద్ ను విడిచి వెళ్ళే అవకాశం లేదని తేల్చి చెప్పటంతో చేసేది లేక మాట్లాడకుండా కూర్చున్నారు. దాంతో చంద్రబాబుకు ఒకేసారి త్రిబుల్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి.

ఒకటి గ్లోబల్ సదస్సులో హాజరయ్యేందుకు ఆహ్వానం లేకపోవటం, ఇవాంకాను అమరావతికి పిలిపించాలన్న ప్రయత్నం విఫలమవ్వటంతో పాటు మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా ఆహ్వానం అందలేదు. దాంతో చేసేది లేక గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నది కాబట్టి పెట్టుబడిదారుల దృష్టిలో పడేందుకా అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఓ ఆంగ్ల పత్రికకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లుగా పే...ద్ద ప్రకటన ఇచ్చి తృప్తి పడింది.