తిరుపతి: తిరుపతి మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత సుగుణమ్మ ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం నాడు దాడి చేశారు. మద్యం సీసాలతో సుగుణమ్మ ఇంటిపై  దాడి చేశారు.  ఈ దాడితో  సుగుణమ్మ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.

దాడి విషయమై సుగుణమ్మ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.