Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం, పరిస్థితి ఉద్రిక్తం

మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. గుంటూరు జిల్లా, తెనాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

unknown miscreants damage NTR Statue, Tension Prevail
Author
Tenali, First Published Aug 21, 2020, 3:33 PM IST

మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. గుంటూరు జిల్లా, తెనాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

విగ్రహం ధ్వంసం అవడంతో అక్కడకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గుర్తుతెలియని అగంతులు ఈ విధమైన రాక్షసానందం పొందడం ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమే అని టీడీపీ నాయకులు అంటున్నారు. 

పోలీస్ శాఖ కలుగజేసుకొని వెంటనే ఆగంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి విగ్రహాలపై కూడా దాడులు జరుగుతున్నాయని వారు వాపోయారు. 

నెల్లూరు జిల్లాలోని కావలిలో సైతం ఇలానే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై కూడా వివాదం నెలకొంది. ఈ విషయంలో ఇప్పటికే.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. 

ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే.. వైసీపీ నాయకులకు వణుకు పుట్టేలా మన చర్యలు ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు కూడా. తాజాగా దీనిపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి బాలయ్య ఫోన్ చేశారు. కావలిలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విగ్రహం నిర్వహించాలని ఆయనకు సూచించారు. కాగా బాలయ్యకు కోటంరెడ్డి అత్యంత ఆప్తుడన్న విషయం విదితమే.

దీనిపై ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసిన .. విగ్రహం వివాదంపై బాలయ్యతో నిశితంగా చర్చించారు. అసలు విగ్రహంపై వివాదం ఎందుకు రాజుకుంది..? స్థానికులు ఆ విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది..? అనే విషయాలను బాలయ్యకు వివరించారు. 

ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే స్థానికులు తొలగించారని బాలయ్యకు ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు.. వివాదాస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని కూడా బాలయ్యకు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios