కర్నూల్‌కి హైకోర్టు తరలింపుపై జగన్ ఆలోచన ఇదీ: కేంద్ర మంత్రి ఆసక్తికరమైన రిప్లై

హైకోర్టుతో పాటు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే  ఏపీ హైకోర్టు తరలింపు విషయమై నిర్ణయం తీసుకొంటామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

union minister Ravi Shankar prasad interesting answer on AP high court move to kurnool from amaravati lns

న్యూఢిల్లీ:  హైకోర్టుతో పాటు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే  ఏపీ హైకోర్టు తరలింపు విషయమై నిర్ణయం తీసుకొంటామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

ఏపీ రాష్ట్ర హైకోర్టు తరలింపు విషయమై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు  కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం నాడు ప్రశ్నించారు.

బీజేపీ ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు. 2019 ఫిబ్రవరి మాసంలో ఏపీ హైకోర్టును కర్నూల్ కు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారని ఆయన చెప్పారు.

హైకోర్టుతో పాటు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ విషయమై నిర్ణయం తీసుకొంటామని మంత్రి ప్రకటించారు.హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యతంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు. 

హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి నుండి కర్నూల్ కు హైకోర్టు తరలింపు విషయంలో ఏపీ ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు. హైకోర్టు తరలింపు కోసం ఎలాంటి గడువు లేదన్నారు.  తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనిదని కేంద్ర మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని జగన్ సర్కార్ ముందుకు తెచ్చింది. అమరావతిలో శాసనరాజధాని,  కర్నూల్ లో  న్యాయ రాజధాని,  విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ప్రతిపాదించింది.మూడు రాజధానుల అంశాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.మూడు రాజధానుల అంశాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios