చంద్రబాబు బాటలోనే మరో నాయుడు ... అవమానపడ్డ సభలోకి అదిరిపోయే ఎంట్రీ..!!

కింజరాపు రాామ్మోహన్ నాయుడు ... అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి స్దాయికి ఎదిగిన తెెలుగు ఎంపీ. ఆయనకు  మోదీ కేబినెట్ లో చోటుదక్కిన వేళ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Union Minister Rammohan Naidu Sensational comments on Lok Sabha AKP

అమరావతి : అది తెలుగుదేశం పార్టీ కష్టకకాలంలో వున్న సమయం. కేవలం ముగ్గురు టిడిపి ఎంపీలు మాత్రమే లోక్ సభలో వున్నారు... ప్రత్యర్థి వైసిపి ఎంపీలు ఏకంగా 23మంది వున్నారు. ఆనాడు మోదీ సర్కార్ మద్దతు కూడా లేదు...రాష్ట్రంలో కూడా అధికారం లేదు. ఇలాంటి సమయంలోనూ ఒకేఒక్కడు వైసిపి ఎంపీలను ధీటుగా ఎదుర్కొన్నాడు... టిడిపి వాయిస్ ను పార్లమెంట్ లో బలంగా వినిపించాడు. ఇలా గతంలో అవమానాలను ఎదుర్కొన్నవాడే ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. అతడు ఎవరో కాదు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.  

రామ్మోహన్ నాయుడు వైరల్ వీడియో : 

గత పార్లమెంట్ లో టిడిపి బలం చాలా తక్కువ... కాబట్టి ఆ పార్టీ ఎంపీలకు మాట్లాడే అవకాశం చాలా తక్కువగా వచ్చేది. ఎప్పుడో ఓసారి మాట్లాడే అవకాశం ఇచ్చేవారు... అదికూడా చాలా తక్కువ సమయం కేటాయించేవారు లోక్ సభ స్పీకర్. దీంతో అప్పుడప్పుడు వారు చెప్పేది పూర్తికాకుండానే మైక్ కట్ అయ్యేది. ఇలా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతుండగా కూడా చాలాసార్లు అర్దాంతరంగా మైక్ కట్ అయ్యేది... ఇలాంటి ఛేదు అనుభవాలను ఆయన గత ఐదేళ్లలో చాలా ఎదుర్కొన్నారు. ఇలాగే ఓసారి ఆయన మాట్లాడుతుండగా తొందరగా ముగించాలని స్పీకర్ కోరారు... దీంతో రామ్మోహన్ చేసిన కామెంట్స్ ఇప్పటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతున్నాయి. ఆనాడే ఆయన టిడిపికి భారీ విజయం సాధిస్తుందని చెప్పారు... ఇలా రామ్మోహన్ లోక్ సభలో మాట్టాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

గతంలో రామ్మోహన్ నాయుుడు పార్లమెంట్ లో మాట్లాడుతుండగా ఇచ్చిన టైమ్ అయిపోయింది... తొందరగా ముగించండి అని లోక్ సభ స్పీకర్ సూచించారు. దీంతో మరో రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని రామ్మోహన్ కోరుతున్నా స్పీకర్ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈ ఒక్కసారికి మరికొంత సమయం ఇవ్వాలని ... వచ్చేసారి టిడిపి భారీ మెజారిటీతో పార్లమెంట్ కు వస్తుంది... అప్పుడు సమయం గురించి ఎలాంటి ఇబ్బంది వుండదంటూ రామ్మోహన్ నాయుడు చాలా కాన్పిడెంట్ గా మాట్లాడారు. ఆనాడు ఆయన అన్నట్లుగానే రాజకీయ సమీకరణలు మారిపోయాయి. అప్పుడు సమయం కోసం అర్జించిన రామ్మోహన్ ఇప్పుడు కేంద్ర మంత్రి అయిపోయారు. 

రామ్మోహన్ నాయుడు ఛాలెంజ్ చేసినట్లే టిడిపి భారీ మెజారిటీతో పార్లమెంట్  లో అడుగుపెట్టింది. ఏకంగా 16 మంది టిడిపి, మిత్రపక్షం జనసేనకు చెందిన మరో ఇద్దరు ఎంపీలు లోక్ సభలో అడుగుపెట్టబోతున్నారు.  మరింత ఆసక్తికర విషయం ఏంటంటే ఎన్డిఏ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి. అంతేకాదు  లోక్ సభ స్పీకర్ పదవిని కూడా టిడిపి కోరుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఒకప్పుడు మాట్లాడేందుకు సమయం కోరిన టిడిపి ప్రధాని మోదీ సహా అందరు ఎంపీలకు సమయం కేటాయించే స్థాయికి చేరనుంది. 

ఇలా పార్లమెంట్ లో టిడిపి బలం పెరిగిన సమయంలో గతంలో రామ్మోహన్ నాయుడు నిండుసభలో కామెంట్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. టిడిపి శ్రేణులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ ప్రమాణస్వీకారం చేసాక ఆయన క్రేజ్ మరింత పెరిగింది... అలాగే ఆయన వీడియో  కూడా మరింతగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

  
  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios