ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులు సరికాదని భావిస్తున్నట్టుగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులు సరికాదని భావిస్తున్నట్టుగా చెప్పారు. మూడు రాజధానులు (Three capitals) పెడితే ఎక్కడికి రావాలని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడం మంచిదే కానీ.. దేనికైనా నిధులు ముఖ్యం కదా అని వ్యాఖ్యానించారు. నిధులు లేకే అమరావతి అభివృద్ది జరగలేదని తెలిపారు. విభజన సమయంలో రాజధానికి నిధులు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని విస్మరించిందన్నారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ ప్రధానిని కలిసి వివరించాలని అన్నారు. వైఎస్ జగన్‌కు పాలించే అవకాశం రావడం.. చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పారు. వైఎస్ జగన్ పాలన బాగానే చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం బీజేపీతో చేతులను కలపాలసి సూచించానని తెలిపారు. ఏపీకి కేంద్రం నుంచి ఆర్థిక సాయం తాను కూడా ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అన్ని మంచి బిల్లులకు తమకు వైసీపీ మద్దతు ఇస్తుందని తెలిపారు.
ఇక, గతంలో ఏపీలో పర్యటించిన సందర్భంలో కూడా రామ్‌దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. రాజధానులు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదేనని తెలిపారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడని.. ఆయన ఎన్డీఏ చేరాలని కోరారు. తమ రిపబ్లికన్ పార్టీ కూడా వైఎస్సార్‌సీపీలాగే ప్రాంతీయ పార్టీ అని.. ఎన్‌డీఏలో భాగస్వామి అయ్యాక అభివృద్ధి వేగవంతమైందన్నారు. అదే తరహాలో వైఎస్సార్‌సీపీ ఎన్‌డీఏలో భాగస్వామి అయితే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
