ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. ఏపీ సీఎస్ నీలం సాహ్నీకి ఫోన్ చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. 200 మందికి పైగా మూర్ఛ, స్పృహ తప్పి పడిపోవడం వంటి లక్షణాల నేపథ్యంలో వైరాలజీ ల్యాబ్‌కు తరలించి పరిక్షీస్తున్నారు అధికారులు.

Also Read:ఏలూరులో అంతుచిక్కని వ్యాధి: తొలి మరణం

కాగా ఘటనలో తొలి మరణం చోటుచేసుకుంది. విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. మూర్చతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. ఈ ఉదయం ఆస్పత్రిలో చేరాడు.

అయితే వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్లే శ్రీధర్‌ మృతిచెందారంటూ అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నా మెరుగైన చికిత్స కోసం వైద్యులు విజయవాడ తరలించలేదని శ్రీధర్ ఆరోపిస్తున్నారు.

మరోవైపు శ్రీధర్‌ మృతిని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు. అస్వస్థతకు గురై ఇప్పటివరకు సుమారు 300 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 117 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.