Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ పిలిచారు... అందుకే వెళుతున్నా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. 

union minister kishan reddy  meeting with ap cm jagan
Author
Amaravati, First Published Aug 19, 2021, 5:02 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో వున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం కిషన్ రెడ్డి నేరుగా తాడేపల్లి సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. 

కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి రాష్ట్రానికి రావడంతో తేనేటి విందుకు రావాలని సీఎం జగన్ ఆహ్వానించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి మర్యాదపూర్వకంగా కలవానికి క్యాంప్ కార్యాలయానికి వెళుతున్నట్లు కేంద్ర మంత్రి దుర్గమ్మ దర్శనం అనంతరం వెల్లడించారు.

వీడియో

అంతకుముందు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన కేంద్ర మంత్రిని ఏపీ దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బిజెపి నాయకులు స్వాగతం పలికారు. ఇక ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభతో స్వాగతం, మేళతాళాలు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.

read more  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం: ఏం జరిగిందంటే?

దేవాదాయ మంత్రి దగ్గరుండి కిషన్ రెడ్డికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు కేంద్ర మంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ వాణిమోహన్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని కిషన్ రెడ్డికి అందజేశారు. కేంద్రమంత్రికి ఆలయ అధికారులే భోజన ఏర్పాటు చేశారు. అక్కడే భోంచేసిన అనంతరం కిషన్ రెడ్డి సీఎం జగన్ కలవడానికి బయలుదేరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios