తిరుపతి: 2014లో తమ పార్టీతో పొత్తు కారణంగానే టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. మోడీని తిట్టిన కారణంగానే తాజా ఎన్నికల్లో  టీడీపీని తిరస్కరించారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు తిరుపతిలో  బీజేపీ సభ్యత్వ  నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  మోడీని ప్రధాని పదవి నుండి  దింపుతామన్న నేతలంతా సెలవులపై విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు.

మోడీని ఓడించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్న నేతలను పార్టీలను ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారంటూ పరోక్షంగా బాబుపై ఆయన విమర్శలు గుప్పించారు.  కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు సైతం ఆ గందరగోళంలో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు.