ఏపీలో అమిత్ షా టూర్: తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ, జనసేన నేతలతో చర్చ

ఈ ఏడాది మార్చి 4వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతికి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సుకు ఈ దఫా ఏపీ అతిథ్యం ఇవ్వనుంది. మార్చి 4, 5 తేదీల్లో తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటించనున్నారు. మార్చి 4న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. 

union minister amit shah to visit tirupati on march 4,5

తిరుపతి: ఈ ఏడాది మార్చి 4వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతికి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సుకు ఈ దఫా ఏపీ అతిథ్యం ఇవ్వనుంది. మార్చి 4, 5 తేదీల్లో తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటించనున్నారు. మార్చి 4న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. 

దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎజెండాలో గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం అంశంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎంలు అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షదీప్‌ ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు.

ఈ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ, జనసేన నేతలతో అమిత్ షా తిరుపతిలో సమావేశం కానున్నారు. మార్చి 5వ తేదీన తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై జనసేన, బీజేపీ నేతలతో ఆయన చర్చించనున్నారు.

ఇటీవల కాలంలో న్యూఢిల్లీకి జనసేన నేతలు వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. తిరుపతి లోక్ సభ ఎన్నికల విషయమై చర్చించారు.మార్చి 4వ తేదీన తిరుపతి సమావేశంలో ఈ విషయమై మాట్లాడుతానని అమిత్ షా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios