వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రానికి సంబంధించిన, జగన్ జైలు అంశాలు చెప్పబోతే అడ్డుకున్న పలు పార్టీల నేతలు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సభా కార్యక్రమాలు సజావుగా నడిపేందుకు సహకరించాలని కోరుతూ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఆల్‌పార్టీ మీటింగ్ నిర్వహించారు.
రాష్ట్రానికి సంబంధించిన, జగన్ జైలు అంశాలు చెప్పబోతే అడ్డుకున్న పలు పార్టీల నేతలు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఒక రాష్ట్రానికి సంభందించిన వేదిక కాదంటూ చురకలంటించారు. పార్లమెంట్ స్థాయిలో అఖిలపక్షం ఎందుకు పెడతారో నేర్చుకోవాలని హితవు వారు హితవు పలికారు.
అసలు మ్యాటరేంటంటే.. చిదంబరం పార్లమెంటు సమావేశాల్లో హాజరు అయ్యేందుకు బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మధ్యలో కలగజేసుకున్న విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలంటూ జగన్ జైలు శిక్ష అంశాన్ని ప్రస్తావించారు.
Also Read:చెత్త నిర్ణయాలతో మీ ఇద్దరే మిగులుతారు: జగన్, విజయసాయిపై బుద్ధా వెంకన్న ఫైర్
దీంతో చిదంబరం వ్యవహారంలో విజయసాయిరెడ్డి జోక్యం పై కేంద్ర హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై మీరెందుకు చర్చ పెడుతున్నారు... మీకు సంబంధం లేని విషయంలో మీరెందుకు స్పందిస్తున్నారని షా మండిపడ్డారు.
అటు కాంగ్రెస్ నేతలు సైతం జగన్ జైలు వ్యవహారాన్ని చిదంబరంకు ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. అనవసరమైన, సంబంధంలేని విషయంపై చర్చకు ఎందుకు వస్తున్నారని టికే రంగరాజన్, ఎంకే ప్రేమ్ చంద్రన్, ఇతర సభ్యులు విజయసాయిరెడ్డిని నిలదీశారు. అఖిలపక్షానికి ఉండే ప్రాధాన్యత తెలుసుకోవాలని ప్రవర్తించాలని వారు హితవు పలికారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీట్టర్ సాక్షిగా మండిపడ్డారు. 151మంది ఎమ్మెల్యేలు గెలిచిన తరువాత కూడా అభద్రతాభావంతో మా పార్టీ ఎమ్మెల్యేలను వైకాపాలో చేర్చుకుంటున్నాడు మీ తింగరి మాలోకం. ఎందుకు అంత భయం? చెత్త నిర్ణయాల కారణంగా మీరు, మీ తింగరి మాలోకం మాత్రమే పార్టీలో మిగులుతారు అనే భయమా విజయసాయి రెడ్డిగారు?
Also Read:ఆ కథేంటో తేల్చుకుందాం రండి: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్
మీ పార్టీలో చేరిన నాయకుడి సవాల్ కి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు?సమాధానం మేము చెప్పడానికి సిద్ధం కానీ ఒక చిన్న కండిషన్. అదే నాయకుడు అన్నం తినేవాడు వైకాపాలో చేరడు అని అన్నారు. మరి మీరు అన్నం బదులు వేరేది తింటున్నా అని ప్రకటిస్తే మేము సమాధానం చెప్పడానికి సిద్ధం’’ అంటూ సవాల్ విసిరారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 17, 2019, 9:23 PM IST