చిత్తూరు: పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి ఉదంతం విషాదకరంగా ముగిసింది. అంత్యక్రియలకు తీసుకుని వెళ్తుండగా ఓ వ్యక్తి పాడెపై లేచి కూర్చున్న విషయం తెలిసిందే. అయితే 24 గంటలు కూడా గడవక ముందే అతను తుదిశ్వాస విడిచాడు. 

చిత్తూరు దజిల్లా మదనపల్లె రూరల్ మండలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దాంతో అతను మరణించాడని భావించి గ్రామస్థులు అంత్యక్రియలకు తీసుకుని వెళ్తుండగా స్పృహలోకి వచ్చాడు. సోమవారంనాడు ఈ ఘటన చోటు చేసుకుంది. 

Also Read: అంత్యక్రియలకు తీసుకెళుతుండగా.. పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి.. !

దాంతో అతన్ని రెవెన్యూ, పంచాయతీ అధికారులు మదనపల్లె ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మంగళవారంనాడు మరణించాడు.

అయితే, అతను ఎవరనే విషయం తేలలేదు. అతని వివరాలు తెలియడ లేదు. అతను ఎవరనే విషయాన్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నాలు సాగించారు.