Asianet News TeluguAsianet News Telugu

కృష్ణాజిల్లా మైలవరంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం... (వీడియో)

సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల పరిశీలనలో dead bodyపై తీవ్రగాయాలున్నాయి. చనిపోయిన వ్యక్తికి సుమారు 28సంవత్సరాల వయస్సు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

unidentified dead body was found in Mayilavaram in Krishna district
Author
Hyderabad, First Published Nov 20, 2021, 2:28 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మైలవరం విజయవాడ ప్రథాన రహదారిపై ఇండోర్ స్టేడియం వద్ద గుర్తు తెలియని మృతదేహం కల్లోలం రేపింది. ఈ విషయాన్ని ఆ దారి వెంట వెడుతున్న ప్రయాణికులు గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  

"

సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల పరిశీలనలో dead bodyపై తీవ్రగాయాలున్నాయి. చనిపోయిన వ్యక్తికి సుమారు 28సంవత్సరాల వయస్సు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

మృతదేహం రోడ్డు పక్కన పడి ఉండడంతో ఇది హత్య? లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి దర్యాప్తులో అది Road Accidentగా పోలీసులు తెలిపారు.

డిఎస్పీ శ్రీనివాసులుహుటాహుటిన మైలవరం చేరుకొని పరిశీలించగా మృతదేహం వీపు వెనకాల టైర్ మార్కులు ఉండడంతో దీన్ని accident గా పోలీసులు నిర్ణారణకు వచ్చారని తెలిపారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి అక్కడకక్కడే మృతి చెందింది. హైదరాబాద్ నారాయణ గూడా పోలీస్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.  వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. Kanchan Bhag కు చెందిన నిధా రెహమాన్ (26) ను Tanker ఢీకొట్టింది. కిందపడిపోయిన నిధా రెహమాన్  తలపై నుంచి ట్యాంకర్ వెళ్ళడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. 

నిధా రెహమాన్ ద్విచక్రవాహనం మీద వెడుతుండగా వెనకనుంచి వచ్చిన ట్యాంకర్ గుద్దడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు dead bodyని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మీద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు కంచన్ భాగ్ కు చెందిన వ్యక్తి అని తెలిసింది. 

ఇదిలా ఉండగా.. నగర్ శివారులోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాల ముందు వెల్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనకున్న కార్లు ఢీ కొన్నాయి. ఘటనలో ప్రాణనష్టం తప్పినట్లు స్థానికులు తెలిపారు. 

పది రోజుల్లో పెళ్లి.. చెవులు, ముక్కుల్లోంచి రక్తం కారి మహిళా కానిస్టేబుల్ మృతి....

మరో ఘటనలో పెళ్లికి వెళ్లి వస్తూ అన్నాచెల్లెళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒకేసారి ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ incident కొత్తూరు పురపాలక పరిధి తిమ్మాపూర్ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Moosapet Zone  కొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన జటారం చంద్రశేఖర్(25) తన చెల్లి మద్దూరి మమత(24) తో ఖిల్లాఘనపురంలో ఉన్న బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. అక్కడ పెళ్లి చూసుకుని తిరిగి  బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. తిరిగి Hyderabadకు Two-wheelerపై ప్రయాణమయ్యారు. మార్గ మాధ్యలో తిమ్మాపూర్ జాతీయ రహదారి మీద బంకులోకి వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 

Follow Us:
Download App:
  • android
  • ios