శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల మీద చంద్రబాబుకున్న మోజును ప్రజాప్రతినిధులు, అధికారులు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. చంద్రబాబు మెప్పు కోసం చివరకు ఎప్పటి నుండో వాడుకలో ఉన్న ఓ ఇరిగేషన్ డ్యామ్ కు తాజాగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు అధికారులు. ఎటూ జిల్లాకు వస్తున్నారు కాబట్టి అనకాపల్లికి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు అనుకున్నారు. అనకాపల్లికి సిఎంను ఎలా తీసుకెళ్ళాలి అన్న సమస్య వచ్చింది. ఏ కార్యక్రమం పెట్టాలని ఎంత ఆలోచించినా ఎవరికీ తట్టలేదు.
ఓ సినిమాలో ‘అవ్వాలి చెల్లి పెళ్ళి...మళ్ళీ మళ్ళీ’ అన్న డైలాగ్ బాగా పాపులరైంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యవహారం కుడా అలాగే తయారైంది. శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల మీద చంద్రబాబుకున్న మోజును ప్రజాప్రతినిధులు, అధికారులు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. చంద్రబాబు మెప్పు కోసం చివరకు ఎప్పటి నుండో వాడుకలో ఉన్న ఓ ఇరిగేషన్ డ్యామ్ కు తాజాగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు అధికారులు.
ఇంతకీ విషయమేమిటంటే, బుధవారం చంద్రబాబు విశాఖపట్నం జిల్లాకు వెళుతున్నారు. ఎటూ జిల్లాకు వస్తున్నారు కాబట్టి అనకాపల్లికి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు అనుకున్నారు. అనకాపల్లికి సిఎంను ఎలా తీసుకెళ్ళాలి అన్న సమస్య వచ్చింది. ఏ కార్యక్రమం పెట్టాలని ఎంత ఆలోచించినా ఎవరికీ తట్టలేదు. చివరకు, అనకాపల్లి నియోజకవర్గంతో నర్సాపూర్ ఇరిగేషన్ ప్రాజెక్టుంది. ఎప్పటి నుండో రైతులకు ఈ ప్రాజెక్టు నుండి నీరు కుడా విడుదల అవుతోంది. ఎలాగూ ఆ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం కుడా జరగలేదు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆ ప్రాజెక్టు గుర్తుకువచ్చింది.
ఇంకేం, ఎంచక్కా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసారు అధికారులు. ఎలాగూ ఈమధ్యే ‘ప్రాజెక్టులకు జలసిరి’ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు మొదలుపెట్టారు. శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలపై చంద్రబాబుకున్న మోజు అందరికీ తెలిసిందే కదా? అందుకే ఎప్పుడో నిర్మాణం పూర్తి చేసుకుని, పంటలకు నీరు కుడా అందిస్తున్న నర్సాపూర్ ప్రాజెక్టుకు జలసిరి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ప్రారంభోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు కుడా జరిగిపోయింది. చంద్రబాబు బలహీనతను అవకాశంగా తీసుకుంటున్న అధికారుల వైఖరిపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. ఇదంతా చూస్తున్న జనాలు పైన చెప్పిన సినిమా డైలాగ్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
