తప్పు చేసిన వారికి నోటీసులిస్తే తప్పేంటీ అంటూ  తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు.  పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని దానికి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

చంద్రబాబునాయుడికి సీఐడీ నోటీసులు ఇవ్వడం మీద మాట్లాడుతూ తప్పు చేసిన వారికి నోటీసులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అవినీతి చక్రవర్తి అని ఆయన మీద పుస్తకాలు కూడా వచ్చాయని ఎద్దేవా చేశారు. నోటీసులను ఏదో భూతద్దంలో చూపించి టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు.

రాజధాని ప్రాంతంలోని ఎస్సీల భూములను అన్యాక్రాంతం చేశారని  నోటీస్ లో పేర్కొన్నారు. ఈ స్కాం లో చంద్రబాబు డైరెక్టర్ అయితే లోకేష్ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారని మండిపడ్డారు.

"

రాజధాని ప్రాంతంలోని భూములను చంద్రబాబు ఆయన బినామీలకు కారు చౌకగా పంచి పెట్టారన్నారు. మార్చి 23 న సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించి తన సత్యశీలతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 

 41 జీవో చట్టబద్ధమైనది కాదు, జీవో నెంబర్ 41 ను విడుదల చేసి భూములను కాజేశారు. దళితలను మోసగించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది గత టీడీపీ ప్రభుత్వమేనని విరుచుకుపడ్డారు.అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకున్నారన్నారు.

రాష్ట్ర ప్రజలందరు వికేంద్రీకరణ మద్దతూ తెలుపుతున్నారనడానికి మున్సిపల్, పంచాయతీ ఎన్నికలే నిదర్శనమన్నారు. తండ్రి మీద నోటీసులు జారీ అయితే లోకేష్ నవ్వడం విడ్డురంగా ఉందని, చంద్రబాబు జైలు కి వెళ్లడం ఖాయం పార్టీ పగ్గాలు నాచేతికి వస్తాయని లోకేష్ సంబరపడుతున్నాడని ఎద్దేవా చేశారు.