బాలికపై యాసిడ్ దాడి చేసింది మేనమామే... డబ్బుకోసమే ఘాతుకం....

నెల్లూరులో బాలిక మీద యాసిడ్ దాడి చేసింది ఆమె మేనమామేనని పోలీసులు తెలిపారు. ఆమె మీద అత్యాచారం జరగలేదని.. డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని అన్నారు. 

uncle attacked the girl with acid for money in nellore

నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై హత్య ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.  అయితే 14 ఏళ్ల బాలికపై దాడికి పాల్పడింది ఆమె మేనమామ నాగరాజే అని పోలీసులు వెల్లడించారు. డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై నెల్లూరు రూరల్ డిఎస్పి హరినాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాలికపై అత్యాచారం జరగలేదని… ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై, డబ్బు కోసమే ఈ కిరాతకానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును విచారించి నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

కాగా, సోమవారం నాడు నెల్లూరులో కామాంధుడు ఓ బాలికపై దాడి చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 14ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో నోట్లో, ముఖంపై యాసిడ్ పోసి.. ఆ తర్వాత గొంతు కోసి పరారయ్యాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు,  పోలీసులు తెలిపిన కథనాల మేరకు.. నెల్లూరు నగరానికి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.

నెల్లూరులో యాసిడ్ దాడికి గురైన 9వ తరగతి విద్యార్ధిని: చెన్పై అపోలో ఆసుపత్రికి తరలింపు

కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం పని మీద బయటకు వెళ్లారు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆందోళన చెందిన ఆమె పక్కనే ఉన్న వాష్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది. సదరు వ్యక్తి తలుపులు బలంగా  తోసుకుని లోనికి వెళ్ళాడు. అక్కడ మరో మారు అత్యాచారానికి ప్రయత్నించడంతో తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో నిందితుడు  ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్ వేశాడు. ఆ బాధ తట్టుకోలేక ఆమె పెద్దగా కేకలు వేయడంతో నిందితుడు కత్తితో గొంతు కోసి పరారయ్యాడు.

చుట్టుపక్కల ఇళ్ళ వారు వచ్చి చూడగా బాలిక రక్తపుమడుగులో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు బాధితురాలిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడు బాధితురాలు దగ్గరి బంధువులు కావచ్చని.. ఇతనికి మరికొందరు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

యాసిడ్ దాడిలో గాయపడిన బాధితురాలిని  బాధితురాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్పి సిహెచ్ విజయ్ రావు, వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం రాత్రి పరామర్శించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎస్పీ మాట్లాడుతూ ఘటన జరిగిన ప్రాంతంలో కొన్ని ఆధారాలు సేకరించామని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios