మచిలీపట్టణం: కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో శుక్రవారం నాడు దారుణం చోటు చేసుకొంది. మచిలీపట్టణం మార్కెట్ యార్డు ఛైర్మెన్ తనయుడిపై పెట్రోల్ పోసి నిప్పటించారు గుర్తు తెలియని వ్యక్తులు.

మచిలీపట్టణం మార్కెట్ యార్డు చైర్మెన్ అచ్చాబా కొడుకు ఖాదర్ బాషాపై హత్యాయత్నం జరిగింది. ఖాదర్ భాషా ఇంట్లో ఉన్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రత్యర్ధులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా... కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకొందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఖాదర్ బాషా భార్యపై అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సుమారు 40 శాతానికి పైగా ఆయన శరీరం కాలిపోయిందని వైద్యులు ప్రకటించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.అతనిపై పెట్రోల్ ఎవరు పోసి నిప్పంటించారనే విషయమై పోలీసులు  ఆరా తీస్తున్నారు.

రెండో పెళ్లే కారణమా?

మరదల్ని ఖాదర్ బాషా ఇటీవలే రెండో వివాహం చేసుకొన్నాడు. ఈ పెళ్లిపై  మొదటి భార్యతో ఖాదర్ భాషాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన గొడవ కూడ ఇదే కారణంతో జరిగిందా.. లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.