ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడాలి : జగన్ నివాసంలో ఉగాది వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో బుధవారం నాడు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకలకు సీఎం నివాసంలో తిరుమల ఆనంద నిలయం తరహాలో ప్రాంగణం ఏర్పాటు చేశారు. పల్లె వాతావరణం , సంస్కృతి , సంప్రదాయాలు ఉట్టిపడేలా అలంకరించారు.
శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం జగన్ నివాసంలో వేడుకలు నిర్వహించారు. సీఎం జగన్ నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలను నిర్వహించారు.
ఉగాది వేడుకల సందర్భంగా ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. నూతన పంచాంగాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది కొత్త ఆలోచనలకు ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు , సిరిసంపదలు , ఆనందాలు నిండాలని సీఎం కోరుకున్నారు.రాబోయే సంవత్సరమంతా మంచి జరగాలని సీఎం ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇందుకు దేవుడి ఆశీస్సులు మెండాలని ఆయన కోరుకుంటున్నట్టుగా చెప్పారు. రైతులకు మేలు కలగాలన్నారు. రాబోయే సంవత్సరమంతా మంచి జరగాలని సీఎం ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇందుకు దేవుడి ఆశీస్సులు మెండాలని ఆయన కోరుకుంటున్నట్టుగా చెప్పారు. రైతులకు మేలు కలగాలన్నారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం దంపతులు వీక్షించారు. ఉగాదిని పురస్కరించుకొని వేద పండితులు సీఎం దంపతులను ఆశీర్వదించారు.