Asianet News TeluguAsianet News Telugu

తాటవొలుచబడును

 

  త్రాగునీటి వనరులను నాశనం చేస్తే సహించబోం, కఠిన చర్యలుంటాయి : సీఎం హెచ్చరించారు

Uddhanam to get pure drinking water from march 1

జనసేన నాయకుడు పవన్  వెళ్లొచ్చినప్పటి నుంచి ఉద్దానం రోజూ వార్తల్లో ఉంటోంది.

 

ఉద్దానం సరైన తాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉండటం, అక్కడ మూత్రపిండాల జబ్బులు విపరీతంగా పెరిగిపోయి, బతుకు దుర్భరమయిపోవడం పాత సంగతే

 

కాని, ఆ వార్తను ప్రపంచం ,ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, సీరియస్ గా తీసుకున్నది జనసేనాని పవన్ పర్యటన తర్వాతే.

 

పవన్ వెళ్లొచ్చాక, అక్కడ ఆసుప్రతులలో డయాలిసిస్ పరికరాలొస్తున్నాయి. మూత్రపిండాల జబ్బులను లోతుగా అధ్యయనం చేసేందుకు నిఫుణులు వెళుతున్నారు. రోగులకు పెన్షన్ ప్రకటించారు. ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు  ఉద్దానానికి శుద్దమయిన నీరు అందిస్తానని ప్రకటించారు. దీనికి ముహూర్తం మార్చి ఒకటిగా నిర్ణయించారు.

 

ఇదంత పవన్ ఎఫెక్ట్ అని వేరు చెప్పాల్సిన పనిలేదు.

 

శ్రీకాకుళం జిల్లా  ఉద్ధానం తో సహా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న 7 మండలాల పరిధిలోని వారందరికీ సురక్షిత మంచినీటిని అందచేస్తామని ఆయన ప్రటించారు.

 

  ’ఎన్టీఆర్ జలసిరి‘ పథకం అమలు తీరును ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు.

 

రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ 100% సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తామని, ఇందుకోసం తీవ్రమైన కసరత్తు జరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. గనులను తవ్వే ప్రాంతాల్లో మంచినీరు కలుషితమవుతుందని, అలాంటి ప్రాంతాలలో కూడా 100% స్వచ్ఛమైన త్రాగునీటిని అందజేయటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.   ప్రజారోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదని, ఎంత ఖర్చయినా వెనుకాడకుండా మంచినీటిని అందజేస్తామని, అవసరమైతే నాబార్డు నుంచి నిధులు తెస్తామని చెప్పారు.

 

జలకాలుష్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని, త్రాగునీటి వనరులను నాశనం చేస్తే సహించబోమని, కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.

  

 

 

 

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios