అమరావతి: ఏపీ జగన్ నివాసం వద్ద ఇద్దరు యువకుల హల్ చల్ చేశారు. గురువారం నాడు రాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు.
భరతమాత సెంటర్ వద్ద మద్యం మత్తులో యువకులు వీరంగం చేశారు. రాత్రి సమయంలో కట్ట మీద తమ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

సమయం మించినందున చుట్టూ తిరిగి వెళ్లాలని సూచించారు పోలీసులు.  ఈ మార్గంలోనే వెళ్తామని భద్రత సిబ్బందితో వివాదానికి దిగారు యువకులు. స్థానికుల సమాచారం. ఈ మార్గంలోనే వెళ్తామని భద్రత సిబ్బందితో వాగ్వావాదానికి దిగారు.

ఈ ప్రాంతానికి చేరుకొన్న పోలీసులపై సైతం యువకులు లెక్కచేయలేదు.  యువకులను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేస్తే ఆత్మహత్య చేసుకొంటామని బెదిరించారు.

యువకులను పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో వీరిద్దరికి సంబంధించిన కుటుంబసభ్యులకు కూడ పోలీసులు సమాచారం వచ్చారు.  కేసు నమోదు చేస్తే ఆత్మహత్య చేసుకొంటామని బెదిరించారు.దీంతో ఏం చేయాలో అర్ధంకాక పోలీసులు తలలు పట్టుకొన్నారు.