Asianet News TeluguAsianet News Telugu

డైపర్ లో నగలు.. ఓ అత్తాకోడళ్ల వింత దొంగతనం.. !!

ఓ అత్తాకోడళ్లకు దొంగతనాల దగ్గర పొత్తు కుదిరింది. ఇద్దరూ కలిసి పోయి..కొత్త తరహా దొంగతనాలకు తెర లేపారు. కంకిపాడులో పట్టపగలే ఈ మహిళా దొంగలు చోరీకి ప్రయత్నించి పట్టుబడ్డారు. పాత కేసులో రెండు నెలల క్రితమే వీరు జైలు నుంచి బైటికి వచ్చారు. రాగానే వెంటనే మళ్లీ దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..

two women thief arrested in west godavari - bsb
Author
Hyderabad, First Published Mar 24, 2021, 9:28 AM IST

ఓ అత్తాకోడళ్లకు దొంగతనాల దగ్గర పొత్తు కుదిరింది. ఇద్దరూ కలిసి పోయి..కొత్త తరహా దొంగతనాలకు తెర లేపారు. కంకిపాడులో పట్టపగలే ఈ మహిళా దొంగలు చోరీకి ప్రయత్నించి పట్టుబడ్డారు. పాత కేసులో రెండు నెలల క్రితమే వీరు జైలు నుంచి బైటికి వచ్చారు. రాగానే వెంటనే మళ్లీ దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..

కంకిపాడు బస్టాండు సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ పచ్చిపాల కోటేశ్వరరావు.. తన ఇంటికి గడియ పెట్టి పనులపై బయటకు వెళ్లాడు. అది గమనించిన విజయంవడకు మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, ఆమె కోడలు సాత్వితలు గడియ తీసి ఇంటి లోపలికి ప్రవేశించారు. 

ఇంట్లోకి వెళ్లగానే ముందుగా టీవీ, ఫ్యాన్ లు వేసుకున్నరు. ఆ తరువాత నెమ్మదిగా ఇంట్లో ఉన్న వస్తువులు గమనించారు. బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు సంచిలో వేసుకున్నారు. ఇంతలో బైటికి వెళ్లిన ఇంటి యజమాని కోటేశ్వరరావు తిరిగి వచ్చాడు. 

తలుపు గడియ తీసి ఉండడం, ఇంట్లోనుంచి టీవీ సౌండ్ వినిపిస్తుండడంతో అనుమానం వచ్చి ఇంటిపక్కల వాళ్లకు కూడా పిలిచి.. ఇంట్లోకి వచ్చాడు. అయితే ఆ ఇద్దరు మహిళలు మాత్రం ఏ కాస్తా తడబడకుండా.. సాక్షాత్ ఇంటి యజమానినే మీరెవరు? ఎందుకొచ్చారు? అని ఎదురు ప్రశ్నించడంతో అక్కడికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు.

వెంటనే తేరుకున్న కోటేశ్వరరావు నా ఇంట్లోకి వచ్చి నన్నే ఎవరని అడుగుతారా? అని గట్టిగా గద్దించేసరికి అతని చేయి పట్టుకుని ఇంట్లోకి లాగే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పక్కకు తోసి బైటికి వచ్చిన కోటేశ్వరరావు. అప్పటికే అక్కడికి వచ్చి బంధువులు, చుట్టుపక్కల వారి సాయంతో వారిద్దరినీ పట్టుకున్నాడు. 

వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మహిళా దొంగలిద్దరూ అత్తా కోడళ్లు అవుతారు. 

కోడుల నెల కిందటే డెలివరీ అయ్యింది. వీరివెంట ఉన్న ఆ శిశువు డైపర్ లో కూడా కొన్ని బంగారు ఆభరణాలు దాచడంతో అంతా ఆశ్చర్చపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios