Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ఏపీలో ఇద్ద‌రు గిరిజ‌న మ‌హిళ‌ల‌ను అత్యాచారం చేసి హ‌త్య చేసిన దుండ‌గులు..

మహిళలపై అఘాయిత్యాల ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చిన వారిపై ప్రతీ రోజు అత్యాచారాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీలో ఇద్దరు గిరిజన మహిళలను దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు కలకలం రేకిత్తించాయి. 

Two tribal women were raped in AP Murderers.
Author
First Published Sep 19, 2022, 9:07 AM IST

ఏపీలో రెండు రోజుల వ్య‌వ‌ధిలో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇద్ద‌రు గిరిజ‌న మ‌హిళ‌ల‌ను రేప్ చేసిన దుండ‌గులు వారిని హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న‌లు రెండు వేర్వేరు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. వీటికి సంబంధించిన వివ‌రాల ఇలా ఉన్నాయి. 

చిత్తూరులో ఏనుగుల బీభత్సం, రైతులపై దాడి.. ఎకరాల కొద్ది పంట నాశనం

బ‌తుకుదెరువు కోసం వ‌చ్చిన మ‌హిళ‌పై..
అనకాపల్లి జిల్లాలోని  అచ్యుతాపురం స్పెష‌ల్ ఎకనామిక్ జోన్ (సెజ్) లో ఉన్న ఆర్ సీఎల్ సంస్థ‌లో ప‌నులు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వ‌ల‌స కూలీలు వ‌స్తుంటారు. అందులో భాగంగానే విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన 32 ఏళ్ల మ‌హిళ కూడా ఇలాగే కూలీ ప‌నుల కోసం త‌న భ‌ర్త‌తో క‌లిసి వ‌చ్చింది. వారిద్ద‌రూ మిగితా కూలీల‌తో పాటు సమీపంలో ఉండే చెట్ల మ‌ధ్యలో గుడారాలు వేసుకొని ఉంటున్నారు. భ‌ర్త కూడా ఓ కాంట్రాక్ట‌ర్ వ‌ద్ద ప‌ని చేస్తున్నాడు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం... రామచంద్ర పిళ్లైని ప్రశ్నిస్తోన్న ఈడీ

శ‌నివారం మ‌హిళ భ‌ర్త ప‌నికి వెళ్లాడు. అలాగే చుట్టుప‌క్క‌ల గుడారాల్లో ఉండేవారంతా ప‌నికి వెళ్లిపోయారు.ఈ స‌మ‌యంలో స‌మీపంలో ఉండే ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన 25 ఏళ్ల సుజ‌న్ స‌ర్దార్ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. అనంత‌రం ఆమెను దారుణంగా రాడ్ల‌తో కొట్టి చంపేశాడు. డెడ్ బాడీని స‌మీపంలోని తుప్ప‌ల వ‌ద్ద పారేశాడు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు నిందితుడు సుజ‌న్ స‌ర్దార్ ను అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌ల‌తో తానే ఈ దారుణానికి ఒడిగ‌ట్టిన‌ట్టు ఒప్పుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ లో అధికారులు తెలిపారు. 

పోయిన ఫోన్ ఎక్క‌డుందో తెలుసుకుందామ‌ని వెళితే.. 
పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ ద‌గ్గ‌ర‌లో ఉండే చెంచుకాల‌నీలో 40 ఏళ్ల‌ మ‌హిళ నివ‌సిస్తోంది. ఆమె ఆశ కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తున్నారు. ఆమె ఫోన్ కొంత కాలం కింద‌ట ప‌డిపోయింది. ద‌గ్గర్లో ఉండే ఓ వ్య‌క్తి టెక్నాల‌జీ సాయంతో ఆ ఫోన్ ఎక్క‌డుందో క‌నిపెడుతాడ‌ని అత‌డి వ‌ద్ద‌కు వెళ్లింది. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆన్ లో లేద‌ని, త‌రువాత తెలుసుకుందామ‌ని చెప్ప‌డంతో ఆమె వెనుదిరిగింది. ఇంటికి వెళ్లే స‌మ‌యంలో అదే గ‌ల్లీకి చెందిన చిన అంజి, బైస్వామి, అంజి లు ఆమె పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. పక్క‌న ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. 

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ అంటూ వార్తలు... విజయసాయిరెడ్డి ఏమన్నారంటే...?

బాధిత మ‌హిళ తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తూ కేక‌లు వేసింది. చుట్టుప‌క్క‌ల వారు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆమెను నిందితులు బండ‌తో కొట్టారు. దీంతో బాధితురాలు చ‌నిపోయింది. ఆ మృత‌దేహాన్ని ద‌గ్గ‌ర్లో ఉండే మ‌రో ప్ర‌దేశానికి తీసుకెళ్లి తాటాకాలు క‌ప్పారు. మ‌హిళ జాడ క‌నిపించ‌క‌పోవడంతో మ‌రుస‌టి రోజు ఉద‌యం కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను ఆశ్రయించారు. దీంతో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఆమె ఆచూకీ కోసం వెతికారు. ఈ స‌మ‌యంలో బాధిత కుటుంబానికి చెందిన పెంపుడు శున‌కం ఆ డెడ్ బాడీ ఉన్న చోటుకు వెళ్లి అరిచింది. కుటుంబ స‌భ్యులు ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించగా బాధిత మ‌హిళ విగ‌త‌జీవిగా క‌నిపించింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios