Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అసెంబ్లీలో వీడియో చిత్రీకరణ: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుండి  ఇద్దరు టీడీపీ సభ్యులను  సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సభలో వీడియో తీసినందుకు గాను  ఇద్దరు ఎమ్మెల్యేలను  శాసనసభ సమావేశాలు పూర్తయ్యే వరకు  సస్పెండ్ చేశారు స్పీకర్.

Two TDP Legilslators  Suspended  From AP Assembly lns
Author
First Published Sep 22, 2023, 9:59 AM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి  ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను  సస్పెండ్ చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీ అసెంబ్లీలో నిబంధనలకు విరుద్దంగా  వీడియో తీసినందుకుగాను  టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం ఆశోక్ లు  వీడియోలు తీశారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు   స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకు వచ్చారు. సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించినందుకు ఇద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని  ప్రసాదరాజు కోరారు.  

నిన్ననే సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించవద్దని కోరినా కూడ టీడీపీ సభ్యుల ప్రవర్తనలో మార్పు లేదని  ప్రసాదరాజు గుర్తు చేశారు. దీంతో  టీడీపీ సభ్యులు  అచ్చెన్నాయుడు, బెందాళం ఆశోక్ లను ఈ అసెంబ్లీ సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

నిన్న కూడ ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు సభలో  నిరసనకు దిగారు.  ఈ నిరసనలతో  టీడీపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని  ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను  ఈ సెషన్ పూర్తయ్యేవరకు  సస్పెండ్ చేస్తూ  స్పీకర్ నిన్న ఆదేశించారు. అంతేకాదు  14 రోజుల పాటు  ఒక్క రోజుకు  టీడీపీ ఎమ్మెల్యేలను  సస్పెండ్ చేశారు. 

also read:నోరు అదుపులో పెట్టుకోవాలి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసనలపై మంత్రి బుగ్గన ఫైర్

అయితే ఇవాళ కూడ ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ పరిస్థితులను సెల్ ఫోన్లలో వీడియో తీస్తున్నారని  చీఫ్ విప్  ప్రసాదరాజు  స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో  ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను  ఈ సెషన్ పూర్తయ్యే వరకు  సస్పెండ్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios