విశాఖ జిల్లి భీమిలి బీచ్‌లో ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. వీరు కాలేజీ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. గల్లంతైన ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు

విశాఖ జిల్లి భీమిలి బీచ్‌లో ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. వీరు కాలేజీ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. గల్లంతైన ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బోట్లతో పాటు హెలికాఫ్టర్ సాయంతో గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. గత నెలలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లోనూ విద్యార్ధులు గల్లంతైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. విజయవాడ సింగ్‌ నగర్‌కు చెందిన విద్యార్ధులు విహారయాత్ర నిమిత్తం సూర్యలంక బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్ధులు సముద్రంలో గల్లంతై తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు.