తిరుమలలో మరోసారి పాము కలకలం రేపింది. మంగళవారం రెండు చోట్ల పాములు కలకలం రేపాయి. స్వామివారి ఆలయ సమీపంలోని కళ్యాణ వేదిక వద్ద నాగపాము ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది.. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే అటవీ ఉద్యోగి భాస్కర్ నాయుడు అక్కడకు వచ్చి ఆ పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా... మ్యూజియం సమీపంలో మరో జెర్రిపోతు తిరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి దానిని కూడా బంధించారు.  పట్టుకున్న పాములను శేషాచలం అటవీ ప్రాంతంలోని అవ్వాచారి కోనలో విడిచి పెట్టారు.