వాళ్లు చేసే ఉద్యోగమే.. ఏటీఎంలలో డబ్బులు పెట్టడం. అలా డబ్బులు పెడుతూనే.. వాళ్ల బుర్రకి మాస్టర్ ప్లాన్ తట్టింది. ఇంకేముంది తెలివిగా.. ఆ ఏటీఎం ల నుంచే ఏకంగా రూ.47లక్షలకు పైగా కాజేశారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే రైటర్ బిజినస్ సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కస్టోడియన్లు మందపల్లి కిరణ్, వల్లు రమేష్, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు పెడుతుంటారు. రామచంద్రాపురం పట్టణంలోని యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఇండియా -1, చెల్లూరు గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, ద్రాక్షారామలోని కెనరా, కేవీబీ, ఐసీఐసీఐ, కె.గంగవరంలోని ఇండియా-1 ఏటీఎం యాంత్రాల్లో నగదు జమ చేసినట్లు లెక్కలు చూపించి.. వారి వద్ద ఉన్న పాస్ వర్డ్ తో నగదు లాగేశారు.

ఈ విషయం బయటపడిన తర్వాత రైటర్ బిజినెస్ సర్వీసు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ, విశాఖపట్నం బ్రాంచి మేనేజర్ చాందపు మనోజ్ కుమార్ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.