కడపజిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల వెల్తున్న కారు అదుపుతప్పి ఒంటిమిట్ట దగ్గర చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు బయటపడ్డారు.
కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని kadapa జిల్లా vontimitta ప్రాంతంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వేగంగా ప్రయాణించిన ఓ కారు ఒంటిమిట్ట చెరువులోకి దూసుకుని వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను చంద్రగుప్త ((78), మహంకాళి (27)లుగా గుర్తించారు. కారు అతి వేగం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
కారు కర్ణాటకలోని సిద్దనూరు నుంచి tirumalaకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. చెరువు నుంచి కారును వెలికి తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఫిబ్రవరి 21న కాకినాడలో ఇలాంటి ఘోరమే జరిగింది. ఆరోగ్యం బాగాలేని అత్తను పరామర్శించడానికి బయలు దేరింది ఆ family. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదలడం ఎందుకులే అనుకుని twins సహా మరో చిన్నారితో బండిపై బయలు దేరింది. సరదాగా సాగిపోతున్న వారి ప్రయాణాన్ని.. ఓ వ్యాన్ మృత్యువు రూపంలో వెంబడించింది. బండిని కొట్టడంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా చిన్నాభిన్నం అయిపోయింది. దంపతులతో పాటు కవలలిద్దరూ మృతి చెందగా, మరో చిన్నారి కొనఊపిరితో కొట్టు మిట్టాడుతోంది.
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వారధిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర road accidnetలో ఒకే కుటుంబానికి చెందిన four members మృతిచెందగా.. చిన్న కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని గుత్తినదీవి గ్రామానికి చెందిన మోటార్ మెకానిక్ వైదాడి కుమార్ (35), భార్య పద్మ (31), కుమారుడు సత్యవర్మ (10), కుమార్తెలు హర్షిత (10) సాత్విక (సిరి వదన)తో కలిసి ద్విచక్ర వాహనంపై కాకినాడ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టింది.
ఘటనలో కుమార్, పద్మ, సత్య వర్మ అక్కడికక్కడే మృతి చెందారు. హర్షిత కాకినాడలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్ర గాయాలపాలైన వారి చిన్న కుమార్తె ఎనిమిదేళ్ల సాత్వికకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని doctors తెలిపారు. అనారోగ్యంతో ఉన్న అత్తను పరామర్శించేందుకు కుమార్.. భార్య, ముగ్గురు పిల్లలతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో సత్యవర్మ, హర్షిత కవలలు. ప్రమాదానికి కారణమైన వ్యానును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, nellore జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల వద్ద గత బుధవారం రాత్రి ఘోర road accident జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చింతవరం నుంచి గూడూరు వైపు వెళ్తున్న autoను.. వరగలి క్రాస్ రోడ్డు వద్ద చింతవరం వస్తున్న lorry ఢీకొంది. అప్పటికీ ఆగకుండా ఆటోను లాక్కుంటూ కొద్ది దూరం వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా… గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ సుధాకర్ (50) అందులోనే ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. మిగిలిన ఇద్దరూ లారీ చక్రాల కింద పడి తనువు చాలించారు.
