ఏపీలో మరో రెండు కరోనా కేసులు..? అనకాపల్లిలో కలకలం

అనుమానితులు ఇద్దరినీ వెంటనే చికిత్స నిమిత్తం విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

Two in Vizag Chest Hospital  over Coronavirus Symptoms

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కూడా పాకేసింది. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలు కనిపించాయని అధికారులు చెప్పారు. తర్వాత అతనికి కరోనా లేదు అని చెప్పాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరులో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు గుర్తించారు. అతను ఇరాన్ నుంచి రావడంతో ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Also Read నెల్లూరులో వ్యక్తికి కరోనా లక్షణాలు...

కాగా.. తాజాగా మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇటలీ నుంచి రాగా.. మరొకరు సింగపూర్ నుంచి వచ్చారు. కాగా ఇద్దరు అనుమానితులు విశాఖలోని అనకాపల్లికి చెందని వారు కావడం గమనార్హం. అనుమానితులు ఇద్దరినీ వెంటనే చికిత్స నిమిత్తం విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

శారదా కాలనీకి చెందిన కృష్ణ భరద్వాజ్‌ అనే యువకుడు ఇటలీలో చదువుకుంటూ అనకాపల్లి వచ్చాడు. అతనికి ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేశారు. ఎటువంటి వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా దగ్గుతో బాధపడుతుండడంతో  విశాఖ చెస్ట్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న  జీవీఎంసీ సీఎంహెచ్‌వో శాస్త్రి శారదా కాలనీకి వచ్చి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఆ యువకుడితో  మాట్లాడినట్టు సమాచారం. కాలనీలో అన్ని ఇళ్లను సందర్శించిన పబ్లిక్‌ హెల్త్‌ విభాగం సిబ్బంది వీధుల్లో బ్లీచింగ్‌ ఫౌడర్‌  చల్లించారు. అతనికి కరోనా నిర్థారణ కాలేదని, కేవలం అనుమానం మాత్రమేనని వైద్యులు తెలిపారు. 

మరో వ్యక్తి రావికమతం మండలానికి చెందిన ఎం. కుమార్‌ అనే యువకుడు సింగపూర్‌ నుంచి కొద్ది రోజుల కిందట విశాఖ వచ్చాడు. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిపిన స్క్రీనింగ్‌టెస్ట్‌లో ఎటువంటి  వ్యాధి లక్షణాలు కనిపించలేదు. కానీ తర్వాత జలుబు, దగ్గు ప్రారంభం కావడంతో వెంటనే కరోనా లక్షణాలుగా భావించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios