విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలిలో బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడుతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నాడు జరిగింది.

బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్‌లోని బాలాజీ కెమికల్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు ఈ పేలుడు చోటు చేసుకొంది. అయితే బాయిలర్ పేలుడుకు కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.  గాయపడిన ఇద్దరు కార్మికులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఫ్యాక్టరీలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని కార్మికులు చాలా కాలంగా ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం.