రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ లాడ్జిలోని వేర్వేరు గదుల్లో వెంకట్‌ గౌడ్, అనితలు ఆత్మహత్య చేసుకొన్నారు. వెంకట్ గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. అనిత ఉరేసుకొని చనిపోయింది.

వీరిద్దరూ రెండు రోజుల క్రితం ఇదే లాడ్జిలో వేర్వేరు గదులను అద్దెకు తీసుకొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకట్ గౌడ్ 15 ఏళ్లుగా తిరుపతిలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తిరుపతి పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన అనిత కూడా పండ్ల వ్యాపారం చేస్తోంది.

వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని వెంకట్ గౌడ్ కుటుంబసభ్యులు తెలిపారు. వేర్వేరు గదులను వీరు ఎందుకు అద్దెకు తీసుకొన్నారో అంతు పట్టడం లేదని పోలీసులు చెబుతున్నారు.

మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.