వారు సీరియల్‌గా కొన్ని ఫోన్‌ నెంబర్‌లను వరుసగా డయల్‌ చేస్తారు. ఎవరైనా ఆడవారు మాట్లాడితే చాలు వారు తమ బుద్ధిని బయటపెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ బయటకు చెప్పుకునేందుకు వీలులేని విధంగా తమ మాటలతో వేధింపులకు పాల్పడుతుంటారు. 

ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ ని వేధించిన కేసులో ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటుచేసుకుంది. 
పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఒక ప్రయివేటు చానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న యువతిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వేర్వేరు నెంబర్‌ల నుంచి ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. 

వీరి వేధింపులు రోజురోజుకు శ్రుతిమీరటంతో ఈ నెల 1న యువతి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఉపయోగించిన ఫోన్‌ నెంబర్‌ల ఆధారంగా వారి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరుకు చెందిన పరుచూరి పెద్దబాబు, పరుచూరి చిన్నబాబు ఇద్దరు అన్నదమ్ములు.

వీరు అదే గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరుగుతుంటారు. వారు సీరియల్‌గా కొన్ని ఫోన్‌ నెంబర్‌లను వరుసగా డయల్‌ చేస్తారు. ఎవరైనా ఆడవారు మాట్లాడితే చాలు వారు తమ బుద్ధిని బయటపెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ బయటకు చెప్పుకునేందుకు వీలులేని విధంగా తమ మాటలతో వేధింపులకు పాల్పడుతుంటారు. 

వీరిపై నిఘా పెట్టిన పోలీసులు వారి ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా పరుచూరి పెద్దబాబును బెంగళూరులోను, పరుచూరి చిన్నబాబును నెల్లూరులోనూ అదుపులోకి తీసుకుని వారిని అరెస్టు చేశారు. వీరు గతంలోనూ ఇదే తరహాలో అనేక మంది మహిళలతో ఇలాగే వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలినట్లు సమాచారం.