Asianet News TeluguAsianet News Telugu

సహాయం చేస్తానని భర్త చనిపోయిన మహిళతో వివాహేతర సంబంధం.. లాడ్జీకి తీసుకువెళ్లి...

ఏలూరులో ఓ మహిళ అదృశ్యం కేసును పోలీసులు చేధించారు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఆమెను హతమార్చినట్లు తేలింది.

two arrested for woman murder in eluru, andhrapradesh - bsb
Author
First Published Feb 3, 2023, 9:23 AM IST

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఓ మహిళ  అదృశ్యమయింది. ఈ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. దీన్ని పోలీసులు చేదించారు. అదృశ్యమైన ఆ మహిళ హత్యకు గురైందని తేలింది. హత్యకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బుధవారం నాడు ఈ కేసుకు సంబంధించి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో  మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఇలా వెల్లడించారు. 

మృతురాలు చింతలపూడి ఎస్ బినగర్ కు చెందిన పొట్ల నాగమణి (37)గా గుర్తించారు. ఆమె భర్త చనిపోయాడు. వీరికి ఇద్దరు  కుమార్తెలు. భర్త లేకపోవడంతో అత్తమామలు, కూతుర్లతో కలిసి ఉంటుంది. ఖమ్మం జిల్లా గంగారం గ్రామంలో వీరికి ఒక స్థలం ఉంది.  ఈ స్థలం విషయంలో నంబూరి శ్రీనివాసరావు అనే వైరాకు చెందిన వ్యక్తితో పొట్ల నాగమ్మకు పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  2016లో పొట్ల నాగమ్మ సివిల్ కోర్టులో స్థలానికి సంబంధించిన గొడవ మీద పిటిషన్ కూడా వేసింది.

ఇది అప్పటి నుంచి కోర్టులోనే ఉంది. కాగా, మూడేళ్ల క్రితం బర్రె రాంబాబు అనే వ్యక్తితో నాగమణికి పరిచయమయ్యింది. అతను చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామనివాసి. స్థల వివాదాన్ని తనకు తెలిసిన పెద్దలతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తానని పొట్ల నాగమ్మకు నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలో ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎన్ని రోజులైనా అతను చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడంతో.. స్థల వివాదాన్ని పరిష్కరించాలని నాగమణి ఒత్తిడి చేసింది. 

ప్రభుత్వ సలహదారుల నియామకంలో రాజ్యాంగబద్దతను తేలుస్తాం: ఏపీ హైకోర్టు

దీంతో రాంబాబు.. నాగమణితో వివాదమున్న శ్రీనివాసరావును కలిశాడు. అయితే శ్రీనివాసరావు రాంబాబుతో బేరం కుదుర్చుకున్నాడు. నాగమణిని ఈ విషయంలో అడ్డుతప్పిస్తే  రెండు లక్షల రూపాయలతో పాటు ఉన్న స్థలంలో ఆరుకుంట్ల స్థలాన్ని ఇస్తానని  ఆశపెట్టాడు. దీంతో రాంబాబు నాగమణిని హతమార్చడానికి ఒప్పుకున్నాడు. ఈ ప్రకారం ఇద్దరూ ప్లాన్ వేశారు. జనవరి 19వ తేదీన తాము వేసిన ప్లాన్ ప్రకారం నాగమణిని రాంబాబు తన కారులో  కాకినాడ సర్పవరం జంక్షన్ లో ఉన్న శ్రీనివాస లాడ్జికి తీసుకువచ్చాడు. 

లాడ్జిలో దిగిన రోజు రాత్రి నాగమణి తలపై జాకిరాడ్డుతో కొట్టి.. ఆమె చీర చెంగుతోనే గట్టిగా మెడకు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత  నాగమణి ఒంటి మీద ఉన్న బంగారు నగలను తీసుకున్నాడు. ఆ తర్వాత  లాడ్జీకి దగ్గర్లో ఉన్న ఎరువుల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఎరువుల సంచి,  పెట్రోల్ డబ్బాను కొన్నాడు. ఎరువుల సంచిలో నాగమణి మృతదేహాన్ని మూట కట్టాడు. ఆ మృతదేహం ఉన్న మూటను తాను వచ్చిన కారులో వేసుకుని, పెట్రోల్ డబ్బా పెట్టుకుని జనవరి 21వ తేదీ తెల్లవారుజామున బయలుదేరాడు.  

అలా రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం ఆర్లపేట గ్రామ శివారులోకి వచ్చాడు. అక్కడ డంపింగ్ యార్డ్ వద్ద తన కారును ఆపి నాగమణి మృతదేహాన్ని అక్కడ వేసి పెట్రోల్ పోసి తగల పెట్టాడు. ఈ పని అంతా అయిన తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటికే  నాగమణి కనిపించడంలేదని కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో మృతురాలి సోదరుడితో కలిసి నాగమణి కనిపించడం లేదని చింతపొడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.  

అయితే పోలీసులు రాంబాబు మీద అనుమానాన్ని వ్యక్తం చేశారు.  అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు కానీ అతను పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. అయితే, కేసులో రాంబాబు మీద అనుమానాలు బలంగా ఉండడంతో సిఐ ఎంబిఎస్ మల్లేశ్వర రావు నంబూరి శ్రీనివాసరావును, రాంబాబును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios