తిరుపతి హత్య కేసులో ట్విస్ట్: భార్య పనేనా, అక్రమ సంబంధమే కారణమా....

Twist in Tiruapthi murder case
Highlights

తిరుపతి హోటల్ లో జరిగిన హత్య కేసు మలుపు తిరిగింది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఢిల్లీ వ్యక్తి హత్య కేసు ఒకరకంగా మిస్టరీగానే మారింది.

తిరుపతి: తిరుపతి హోటల్ లో జరిగిన హత్య కేసు మలుపు తిరిగింది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఢిల్లీ వ్యక్తి హత్య కేసు ఒకరకంగా మిస్టరీగానే మారింది. అతన్ని సుభాష్ కుమార్ గా మొదట భావించినప్పటికీ మునీత్ అయి ఉండవచ్చునని అంటున్నారు. 

భార్యతో కలిసి అతను ఈ నెల 4వ తేదీన తిరుపతి వచ్చాడు. 5వ తేదీన నెల్లూరు మైపాడు బీచ్ లో మరో మహిళతో ఫొటో దిగాడు. మర్నాడు తెల్లవారు జామున గదిలో రక్తం మడుగులో శవమై కనిపించాడు. 

తన భర్త వెనక వస్తున్నాడని హోటల్ సిబ్బందికి చెప్పిన భార్య రైల్వే స్టేషన్ కు వెళ్లిపోయింది. భార్యనే అతన్ని హత్య చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోటల్ గదిలోని సిసీటీవీ ఫుటేజీ పనిచేయడం లేదు. రోడ్డు మీది సిసీటీవీ కూడా పనిచేయడం లేదు.

గదిలో మద్యం సీసాలు కనిపించాయి. మృతుడి కాల్ డేటాను పోలీసులు పరిశీలస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమైన ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు దొరికాయని పోలీసులు అంటున్నారు. కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు. 
 

loader