Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి బిడ్డ మాయం కేసు: విషయం బయటపెట్టిన గూడూరు డాక్టర్లు

తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో పసిబిడ్డ మాయం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గూడూరుకు చెందిన శశికళ అసలు గర్భమే దాల్చలేదని స్థానిక మైథిలి ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు.

twist in baby missing in the womb in tirupati ksp
Author
Tirupati, First Published Jan 17, 2021, 4:26 PM IST

తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో పసిబిడ్డ మాయం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గూడూరుకు చెందిన శశికళ అసలు గర్భమే దాల్చలేదని స్థానిక మైథిలి ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. 2020 ఆగస్టులో పరీక్షలు చేసి నిర్థారించామని చెబుతున్నారు. అయితే బాధిత కుటుంబం మాత్రం నిన్ననే డెలీవరి అయిందని అంటున్నారు. 

కాగా శశికళ తన గర్భంలోని శిశువును మాయం చేశారంటూ ఆదివారం గొడవకు దిగింది. శశికళ అనే ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆమె ఆస్పత్రికి వచ్చారు. అయితే ఈసారి వింత వాదనతో ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేసింది.

బిడ్డ కాన్పు కోసం వచ్చిన తనకు అసలు గర్భమే రాలేదని అంటున్నారని ఆస్పత్రి నిర్వాహకులతో ఆమె వాగ్వాదానికి దిగారు. గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల తీరును తప్పుపడుతూ ఆస్పత్రి ముందే నిరసన వ్యక్తం చేశారు.

Also Read:గర్బంలోని బిడ్డ మాయం: మహిళ ఆరోపణ, ఖంగుతిన్న వైద్యులు

మహిళ ఆరోపణపై ఆస్పత్రి వైద్యాధికారులు షాక్‌కు గురయ్యారు. ఆమె తీరుపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శశికళ కడుపులో ఉన్న గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సదరు మహిళ మానసిక పరిస్థితిపై కూడా వివరాలను సేకరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios