గర్బంలోని బిడ్డ మాయం: మహిళ ఆరోపణ, ఖంగుతిన్న వైద్యులు

తల్లి పొత్తిళ్లలోంచి బిడ్డను మాయం చేసి సొమ్ము చేసుకునే ముఠాల ఉదంతాలు మనం చూశాం. కానీ తన గర్భంలోంచి శిశును మాయం చేశారంటూ ఓ మహిళ ఆరోపించడం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలకలం రేపింది. 

pregnant women protest in tirupati govt hospital ksp

తల్లి పొత్తిళ్లలోంచి బిడ్డను మాయం చేసి సొమ్ము చేసుకునే ముఠాల ఉదంతాలు మనం చూశాం. కానీ తన గర్భంలోంచి శిశును మాయం చేశారంటూ ఓ మహిళ ఆరోపించడం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ అనే మహిళ ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చారు. పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళ.. సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. గతంలో ఎన్నడూ చూడని ఆ వింత వాదనతో ఆస్పత్రి సిబ్బందితో పాటు రోగులు ఖంగుతున్నారు.

కాన్పు కోసం వచ్చిన తనకు గర్భం రాలేదని అంటున్నారంటూ ఆమె ఆరోపించింది. తన గర్భంలోని బిడ్డను మాయం చేశారంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు.

అయితే మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ మానసిక స్థితిపై వివరాలను సేకరిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios