అత్తా, కోడళ్లను గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేసి.. మృతదేహాలను చెల్లాచెదురుగా పడేసిన సంఘటన  శ్రీకాకుళం జిల్లా లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం నగరంలోని బొందిపురానికి చెందిన అబ్దుల్ ఖుదీష్ జిలానీ అనే వ్యక్తి తల్లి, , భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అతను చెప్పుల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.  రోజూ ఉదయం పిల్లలు స్కూల్ కి వెళ్లాక అతను తన చెప్పుల దుకాణానికి వెళ్లేవాడు.ఇంట్లో భార్య మోహర్ ఉన్నీషా(37), తల్లి జురాబాయ్(65) లు ఉండేవారు.

కాగా.. గురువారం స్కూల్ కి వెళ్లిన పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇదే విషయాన్ని పిల్లలు తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. జిలానీ.. ఇంటికి వచ్చి మరో కీతో తాళం తీసి చూడగా.. భార్య, తల్లి విగత జీవులై కనిపించారు. కాగా.. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. 

తన తల్లి, భార్యను హత్య చేయడంతోపాటు ఇంట్లోని దాదాపు రూ.4లక్షల నగదు ను అపహరించుకపోయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేపడుతున్నారు. అత్తా, కోడళ్లను బ్యాటు తో తలపై బలంగా మోదీ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.